ఒక మనిషి - కొన్ని ఆలోచనలు - మరికొన్ని నేనులు
****
April - Sept 2000
**
భవిష్యత్తు ఆలోచనల నించి
తప్పించు కోలేని మనసుని
చూసి దిగులూ, భయం :
**
అవగలిగితే మమేకం, అది చాలు జన్మ ధన్యం
మనసు లోని రేపు అదృశ్యం
క్షణం పాటు మనసు మరణించి
మరుక్షణం జన్మించగలిగితే
ఙ్ఞాపకాల అంటు వదలిపోతే
ఉన్నది పోతుందన్న భయం
మాయమవుతున్న క్షణం
ఏదో ప్రత్యక్షం అవుతూ ఉంది నిరంతరం
గొలుసు తెగింది తరవాత క్షణం తో
*********************************
ఎప్పుడు ఏది చదివినా ఎంతో బాధ. "అల్పం, అల్పం" అని తిట్టుకుంటూ, పక్కదారుల్లోకి మళ్ళిపోయే మనసు ని control చెయ్యడానికి ప్రయత్నిస్తూ - యమ బాధ.. ఏదీ, ఇప్పుడు లేదే ? ఏ మహర్షి దయ ఇది ?
గొప్ప, నీచం అనేవి మన మనసులో చిన్నప్పటి నించే పాదుకొని పెరిగి ఎలా మహా వృక్షాలయ్యాయో స్పష్టం గా తెలుస్తోంది. ఇంకో విషయంతో (ఏదో కార్పొరేట్ వాతావరణాన్నో, మహా విజ్ఞాన శాస్త్రాలనో, తలలు పెరిగాయనుకుంటు న్న మేధావులతోనో) అనుక్షణం నన్నూ, నా మెదడునీ compare చేసుకుంటూ, తక్కువ భావం తో బాధ పడుతూ, - అబ్బా ఎంత రోదన, బాధ. ఎంత generate అయ్యిందో ఇలా వందల వేలాది విద్యార్ధుల మెదళ్ళ లోంచి. - సూటి గావిషయాన్ని
కలుపుకోలేక, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేక. ( యోగం లేక, అంటే 'యుజ్' లేక)
*********
ఈ క్షణాన్ని నిశ్వసిస్తున్నాను. జీవితాన్ని విశ్వసించాలని లేదు నాకు.
(జీవితం అనే మాటకి ఎన్ని associations మెదడులో ! ఎప్పుడో మొదలయి ఎన్నో సంవత్సరాల తరువాత మనం చూడలేనంత దూరం గా ఉన్న భవిష్యత్తు లో ఒక స్థిర బిందువు దగ్గర అంతమయే పదార్ధమని - ఎంత నమ్మకమో )
*********
చదివిన రెండు మంచి పుస్తకాలు - 1) the monk and the philosopher (conv. betw Ricardo Matthieu and his Dad
2) the monk and the riddle (present moment living under venture capitalism)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home