2006-06-20

అహం స్ఫురణ

Sept –Nov 2003

కొంత కాల భాగం నా తలలో ఘనీభవించి
పగళ్ళూ, రాత్రులు గా ప్రవహిస్తూ ఉంది.
అంతా నిశ్శబ్దంగా, స్పష్టంగా ఉంది.
ఎవరూ అడగకపోతే ప్రశ్శల్లేవ్, జవాబుల్లేవ్.
కల్పించక పోతే చట్రాల్లేవ్ బద్దలు చెయ్యడానికి విగ్రహాల్లేవ్
అధికారమే లేనప్పుడు ప్రతిఘటించడం ఎందుకుంటుంది ?
విప్లవ వాదులందరికీ పని లేమి !

సొంతమయిన ఆలోచన వల్ల ప్రపంచంలో ప్రత్యక్షమైన కాలం
వారూ వీరూ తనననుసరించి ఉండాలని ఆశ పడుతుంది
ఆశ ఆశయంగా ఉద్రేకంగా మారి చివరకు హింసిస్తుంది.
వట్టి ఆలోచన తప్పు కాదు - "నా"త్వం లోనే ఉంది అభాసం!

2 Comments:

Anonymous అజ్ఞాత said...

చాలా గాడమైన భావాల్ని కుడా అక్షారాలుగా మార్చొచ్చా.. అవుననిపించింది ఈ బ్లాగ్ చూశాక

7:15 AM  
Blogger Chakri said...

vyaakaranam lo vunna viseshamaina advita nidhi ki suchana "na"

8:49 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home