ప్రశ్న
**January 2001 ***
నీ వెహికిల్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా ? అని ప్రశ్నించాడు ఆయన. అంటే శరీరారోగ్యం కాపాడుకుంటున్నావా అని అడిగాడన్నమాట. నిజంగా శరీరాన్ని ఒక వెహికల్ లాగా ఫీల్ అయినప్పుడు తెలుస్తుంది ఈ మాటకున్న విలువా, ఆహారానికి జీవితం లో వున్న ప్రాముఖ్యతాను.
నిండా తిన్నప్పుడు వచ్చేమత్తులో చురుకు ఆలోచనలు ఎక్కడికి పోతయ్యో! అందుకే జస్ట్ఇనఫ్ తినమన్నారు. అంటే ఎంత అని అడగొద్దు - ఎవడికి వాడు తేల్చుకోవలసిందే ఇది.
**
"ఆనాటి ఫీలింగ్ ఇప్పుడు లేదు. ఆనాడు వాడు అలా మాట్లాడాడంటే ఏ స్టేట్ఆఫ్ మైండ్ లో వున్నాడో ఇప్పుడు తెలుస్తోంది" - ఈకంపారిషన్స్ అన్నీ వృధా, వృధా.
ఆనాటి ఆ స్థితి (బస్ లో ఫీల్ అయిన బోధి వృక్షపు ఛాయ) ఇలా ఈ కారణాల వల్ల సంభవించింది అనుకోవడం శుద్ధ దండగ అనలిసిస్. ఇప్పుడున్న స్థితి ఏమిటి? ఈ ఆలోచనని పట్టుకో. కాలం డైనమిక్ కాబట్టి నీ ఆలోచనలూ డైనమిక్ - నిరంతరం మారేవి.ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ని ఒక ఫిక్సెడ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కి ముడి పెట్టడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించాలి. ఇది causal రిలేషన్ షిప్ కి లొంగేది కాదు. సెక్స్ కోరికలు తగ్గిపోతాయని భ్రమ పడొద్దు కాలం తో పాటు. వాటిని పలవరించి, పరిశీలించి, పరికించడానికి ప్రయత్నించు. తప్పకపోతే అనుభవించు.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home