2001-10-13

ఎవరు

10/13/01
ఎన్నిసార్లు అన్పించింది ముందు జీవితంలో ఎవరు వీడు అని. అసలు కొద్ది సార్లైనా అలా అన్పించడమే ఆశ్చర్యమేమో. ఎప్పుడైనా వాడు బాగా తగ్గిపోయినప్పుడు, చుట్టూ ఉన్న ప్రపంచం
లోని శక్తుల పట్ల ఆకర్షితమయ్యే రిసెప్టర్స్ ఒక్కసారిగా మెదడులో చొరబడి ఎలా మళ్ళీ నేను ను ఉత్తేజితం చేసాయో...
**
చేసే పని ఎందుకు చేస్తున్నాడో తెలీదు. నిజమయిన అవసరాలు లేకుండా సైకలాజికల్ నీడ్ కోసం సంపాయించేవాళ్ళే అందరూ.. అలా చెయ్యక పోతే కనీస భౌతిక అవసరాలకి కూడా ఉండదన్న భయం.. అందరూ అలా భయపడుతూంటే అది కొంతకాలానికి నిజం కాక చస్తుందా ?
****
సెర్మన్ ఆన్ ద మౌంట్ లో బుద్ధచాయలు స్పష్టం గానే కన్పడుతున్నా, వాటిని ఎక్కువ చేసో తక్కువ చేసో అర్ధం చేసుకోలేము ఆయనని.. అసలు అర్ధం చేసుకోవాల్సింది మనల్నే..