ఊహా సంభాషణ
7/30/02
“సోర్స్ దగ్గ్గరకి వెళ్ళమంటున్నారా? హలో, ఎవరండీ మాట్లాడేది ? మహర్షి గారేనా, ..ఆ కొండ దగ్గిర్నుంచేనా?”
“…”
“మౌనంగా ఉండి పోయేరేమిటండీ.. నేను చేసే ప్రయత్నం అంతా సోర్స్ కోసమే నండీ.. కానీ ఏది నేను సోర్స్ కి దారి అనుకుంటున్నానో అది అది కాదేమోనని భయంగా ఉంది.”
“…”
“ఈ భయాన్నే సోర్స్ చేసుకోమంటారా.. రేపు ఏదో జరుగుతుంది, దొరుకుతుంది అనుకోవడమే తప్పంటారా - అవును వాచ్యంగా తెల్సండి - ఇంకో పెద్దాయన యాభై అరవై ఏళ్ళు చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పారు.. అయినా మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటామండీ”
_______________________________________________ వాడనుకునేదీ ఇదే - ఎప్పటికీ ఏదీ అద్భుతం జరగదన్న విషయం ఎప్పటికైనా 'తెలియడం' జరుగుతుందని ఆశిస్తాడు. అబ్బా ఎంత casuistry..
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home