సంఘటన
3/3/01
చాలాసార్లు అనుభవమే. ముఖ్యంగా ఏదైనా చెడ్డ సంఘటనో, దేన్నైనా కోల్పోవడమో, తప్పుకు ఫలితం అనుభవించినప్పుడొ - ఎంతగానో పరుగులు తీస్తుంది మనసు ఆ సంఘటన జరగడానికి ముందు ఉన్న కాలానికి. ప్రస్తుతం ఉన్న స్థితి లో ఏదైనా ఉపద్రవం జరిగితే ఎలా మనసు వెనక్కి పరుగులు తీస్తుందా అని ఆలోచిస్తున్నాడు అతడు. అంటే future లో చెడ్డ సంఘటన ని ఊహించుకొని మనసు ఏ విధంగా react అవుతుందో అలోచిస్తున్నాడన్న మాట. ఇదొక defensive mechanism లాగా ఉంటుంది. చెడ్డ నీ ఉపద్రవాల్నీ ఊహించుకొని అది జరక్క పోతే తృప్తి పడడం.. ముందే చెడ్డని ఊహించుకున్నందువల్లే అదిజరగలేదనుకోవడం...
ఎప్పుడూ పరుగులు తీసే దీన్ని గమనించుకుంటో రాసుకుంటే అదొక అనుభవం.. ఈ గమనింపు లో నిజాయితీ ఎంతముఖ్యమో అర్ధం అవుతోంది అతడికి కొంచెం కొంచెం.. రాయడం లో వున్న నిజాయితీ కొంచెం గా మిగతా విషయాలకి పాకడం తెలుస్తోంది.
ఒక సమస్య ని పరిష్కరించలేక పోయి దాన్ని పూర్తిగా ఒప్పుకున్నప్పుడో, తన మాటల వెనుక ఉన్న అసలైన motives ని సూటిగా చూడగలిగినప్పుడో తెలుస్తోంది - విషయాన్ని వున్నదున్నట్లుగా చూడడం లో ఉన్న సౌందర్యం.
***
నిన్నంతా ఇంటికి వచ్చిన ఆఫీసు మనిషి potent, aggressive (and diluted) talk తో గదిచిపోయింది.
ఒక్కక్కప్పుడు ఈ సంఘటనలన్నీ వివరంగా రాయాలని ఉంటుంది.. చూసే దృష్టి లో తేడాల వల్ల మామూలు విషయాలు ఎంతెంత తేడా గా కన్పిస్తాయో office లోని వివిధ రకాల మనుషులకి..
ఆఫీసు లో వివిధ పాత్రధారులు ఏయే సమయాల్లో ఎలా ప్రవర్తించారో, వాళ్ళ మానసిక స్థితుల్నీ పరిస్థితుల్నీ వీలైనంతవరకూ పూర్తిగా రాయాలంటే ఎంత ఓపిక, జ్ఞాపకం, focus కావాలో - కాగితంమీద పెట్టడానికి భయాలు, సంకోచాలూ ఎదురవుతాయి.. ఇంకోళ్ళ మానసిక స్థితి ని మనకళ్ళతో చూడడం లోనే అభాసం ఏదో ఉన్నట్టుగా వుంది..
అందరికీ ఒకేలా కనబడుతోందని ఎక్కువ మంది నమ్మే ఈ ప్రపంచం లో చాలా ఎక్కువ భాగం అనేక రకాలుగా ప్రతిష్టితమై ఉంది అనేక రకాల మనుషుల్లో .. వేల ప్రపంచాలు ఒకే సమయం లో నడుస్తున్నై.. కనీసం అలోచనల్లో..
క్వాంటం కఠినప్రశ్నలకి జవాబు గా చెప్పే అనేక ప్రపంచ సిద్ద్దాంతం..
1 Comments:
మీ బ్లాగు ఎంతో బాగుంది
http://telugubloggers.blogspot.com నందు ఒక లింకు కలిపినాను, మీకు ఇంకా తెలుగు బ్లాగులు తెలిసిన దయచేసి చెప్పగలరు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home