2001-10-23

తప్పు

10/23/01
ఏదైనా తప్పు కనబడితే చాలు. ఒక్కసారిగా అధికారం చూపించుకోడానికి లంఘిస్తుంది దానిమీదకి మనసు. పళ్ళు పటపటకొరుకుతూ, తిట్టుకుంటూ, తెలిసిన తనాన్ని నిరూపించుకోవడానికి తహతహలాడుతుంది. పైకి మెత్తగా, మృదువు గా, మంచి గా, సున్నితంగా కనిపించే ఈ నేను ఒక్కసారిగా కొయ్యబడ్డ భావన. ఈ కోపానికి అసలు కారణం తప్పు చెయ్యడమో జరగడమో కాదు. ఎదుటివాళ్ళని కొట్టడానికి అవకాశం కోసం సిద్ధంగా పొంచి ఉన్న మనసుయొక్క ఫాకల్టీ అని స్పష్టం గానే అర్ధమవుతూ ఉంది. అర్ధం అయినంత మాత్రాన ఒరిగేదేమన్నా ఉందా ?
బోను లో తిరుగుతున్న పులి కళ్ళు గుర్తొస్తున్నాయి. దాని మొహం లో ఎప్పుడూ ఫిక్స్ అయిన ఫీలింగ్ ఆఫ్ అగ్రెషన్ యొక్క అంశ తనలో తెలుస్తూంది.
**
తప్పొప్పుల దృష్టి లేకుండా కోపాన్ని గమనించుకోమంటున్నాయి బుద్ధ జీవాలు. సాధ్యమేనా ?