2001-11-11

బాధా సప్తశతి

11/11/01
ఏదో విషయంలో వచ్చిన అశాంతి, అసంతృప్తి
పరిసరాల్లోని ప్రక్క వాళ్ళమీదకి ప్రవహించి
అట్నించి అమిత వేగంతో పరావర్తించి
మిరుమిట్లు గొలిపే పెద్ద శబ్దం తో
కాలాన్ని భళ్ళు మనిపించింది.
మాటలు రాక మ్రాన్పడి పోతే
అటూ ఇటూ దుమికి, నన్ను ఖండ ఖండాలుగా
నరికి, తిట్ల రూపం లో పారుతోంది.