2005-05-02

ఆధ్యాత్మిక పరిష్కారం

Sept 7, 2002.
ప్రతి సమస్యకీ ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటుంది - ప్రేమ నిజంగా ఉంటే చాలు - ఏది ఎలా జరిగినా మంచికే - అంతా మన perception లోనే ఉంది - వగైరా మాటల్ని చాలామంది ఆధునికులు హేళన భావం తో చూస్తారు. ఈ రకమైన దృష్టి - జరుగు తున్న దంతా ఇప్పటిదాకా మనకి మనమే పేర్చుకుని ఉన్న దానికి కొనసాగింపు అనీ 'నేను' కరగడం ద్వారా భౌతిక పరిస్థితి మారడానికి అవకాశం ఉందనే దృష్టి - 'స్వ' బాగా తగ్గి పోవడం వల్ల వచ్చే paradigm shift అని అన్నా అర్ధం అవడం కష్టమే - ఆ మాటని సోకాల్డ్ పాప్ సైకాలజీ సెల్ఫ్ హెల్ప్ గురువులు బాగా అరగదీసి వాటి చుట్టూ ఒక ఆరా కల్పించారే…
//సుందర చైతన్యానంద గారు వార్త లో రాస్తున్నారు. - మనకి శరీరాలు వేరైనా మనసులు ఒకటే; ఎన్నటికీ విడిపోగూడదు అని తీర్మానాలు చెయ్యడం, అలా ముందు విడిపోవచ్చన్న భయం వల్లనే అని! - ఉన్నది ఉన్నట్టు గా చూడడం అన్న శీర్షిక పెట్టారు - బుద్ధిష్టుల ని తలపిస్తూ..

// ఎగువ మధ్యతరగతి భార్యాభర్తల మధ్య ఒక ఆదర్శ ఇమేజ్ ప్రకారం ఎంతో సహజం గా వున్నట్టనిపించే నటన అలవడుతుంది ఇక్కడ సమాజంలో - ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గానీ ఏదైనా కమ్యూనిటీ కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు గానీ - ఉన్నట్టుండి కక్షలూ కావేషాలూ మాయమై గౌరవనీయమైన రిలేషన్ షిప్ ప్రొజెక్ట్ చెయ్యబడుతుంది ఎలాగో. ఇలా స్పర్ధలు వచ్చినపుదు అలాంటి ఆక్టివిటీస్ లోకి జారిపోవడంకూడా ఒక రకమైన సొలూషనే. లేనిదాన్ని (లేదా వివాహ బంధంపేరిట ఎక్కడో మూల అణగారి మిణుకు మిణుకు మంటున్నదాన్ని) బాగా ఉన్నట్లు చూపడం - ఎస్కేప్ వల్ల ద్విగుణం బహుళం అయ్యే బాధకన్నా దీన్ని ఎదుర్కోవడమే మేలు.

20 th Sept
దైనందిన జీవిత వ్యవహారాలలో 'స్వ' ని పెంచుకోవడం కోసం ఘర్షణ బాగా తగ్గిపోతే
'స్వ' మాయమయే ఇతర సుఖాల వెంపర్లాట (లైంగిక etc.,) ఉండదంటున్నాడాయన.
Oct 20
ఆధ్యాత్మిక రచనలు చేసిన ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళ కొన్నాళ్ళ క్రితం అంటోంది (సి-స్పాన్ లో)…
If somebody comes to me and says ‘I am a Christian’, I’ll be very surprised because I’m trying to be one for the past several years. And I’d ask ‘ have you already become a Christian ?
ఈవిడ పంజరాన్ని తప్పించుకునే పక్షులు అనో అలాంటి అర్ధం వచ్చే ఏదో పేరు గల పుస్తకం రాసింది.
అలాగే చాలా జంట లు చెప్పాలేమో - we are living together for the last several years, trying to get married. అని…