2001-03-14

అప్పుడు - ఇప్పుడు

14th March, 01
వాడి కుంది నాకెందుకు లేదు అనికాదు అడగడం.. అది వేరే రకం..
అప్పుడు నేను ఏదో స్థితి ని సాధించానుకదా, ఇప్పుడు నాకెందుకు లేదు ? అబ్బ ఆ రోజులు ఎంత బాగుండేవి ప్రశాంతంగా, ఇప్పుడేంది ఇంత ఆందోళన, గందరగోళం? ఆ సుఖాలు నాకెందుకు లేవు ఇప్పుడు ? ఆ మానసికి స్థితి మళ్ళీ రాదే? కోరికల సౌధాలు హఠాత్తుగా మాయమైనాయేం (మొలిచినాయేం)
ఇదే ఏడుపు జీవితమంతా మనిషికి. ఎందుకు continuity ఉండాలి అని deep గా ప్రశ్నించుకోవడం చాలా కష్టం. కోరికలు తీరనందుకు బాధ ఒక రకం. కానీ past లో కోపాన్నో ఇంకోకటి దేన్నో జయించాను అనుకున్నాడు లేదా తెలివిగలవాడినని prove అయింది అనుకున్నాడు. అవే స్థితులు continue అవాలి - వాటి కోసమే వెంపర్లాట. ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతోందో చూడలేడు.
ఇప్పుడు ఈ క్షణం లో దాన్ని గురించి ఎంత ఆలోచించినా, జ్ఞాపకం తెచ్చుకుందామనుకున్నా ఏదో వెలితి. ఆ స్థితిని కంపేర్ చేసుకుని. పేరు పెట్టలేని ఆస్థితి లో ఉన్నప్పుడు ఎంత చురుకుదనం మైండ్ కి.. ఏ విషయం ఆలోచించినా ఎంత స్పష్టత..ఉండాల్సిన విషయాలమీద ఎంత ఆసక్తి.. సరియైన సమయం లో సరియైన ప్రమాణంలో(?!) ఇంక ఇదేనా కొడుమ.. జీవితమంతా దాన్ని గుర్తుకు తెచ్చుకుని వేళ్ళాడడమేనా..క్షణం నిత్య నూతనం గా భాసిస్తుందా మళ్ళీ? (ఏవి తల్లీ నిరుడు కురిసిన..) ఆ స్థితి లో ఉన్నప్పుడు మంచితనం, చెడ్డతనం, భయం, సెక్సు కోరికలూ అన్నీ విడి విడి ఆలోచనలేనని ఒక క్షణం మెరుపులా మెరిసింది ఒక భావన. భౌతిక ప్రపంచం అంతా ఎలా images రూపం లో హర్మ్యాలుగా కట్టబడిందో అనుక్షణమూ అర్ధమయ్యేది.
ఆ స్థితి లేనప్పుడు ఈమాటలు వందలసార్లు చదివినా, వేలసార్లు 'అర్ధం' చేసుకోవడానికి ప్రయత్నించినా - అవి కేవలం మాటలుగానే మిగిలిపోయేవి.
మళ్ళీ ఆస్థితి రావాలంటే, అది కేవలం ఒక ఆలోచనగా, జ్ఞాపకంగా మిగిలిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు వాడు. ఏమీ చెయ్యొద్దు అని జవాబు అని ఆయన దగ్గిర్నించి. అసలు నీకా స్థితి మళ్ళీ ఎందుక్కావాలి ఏంటి నీ మైండ్ లో జరుగుతున్నది ఇప్పుడు.. ఇప్పటి స్థితి అది చూస్కోమంటున్నాడు మిగిలిందంతా వదిలేసి.