విశ్వాల్గారిధమ్
12/8/02
ప్రపంచాన్ని కంట్రోల్ చేసే బేసిక్ అల్గారిథమ్ కోసం వెతుకుతున్నారట స్టీవెన్ వోల్ఫ్రామ్*గారు. ప్రపంచంలో నేనూ ఒక భాగం కాబట్టి అది తెలిస్తే 'నా' సమస్య పరిష్కారమౌతుందా అందరికీ ? విశ్వజననం, కాలం లాంటి వాటికన్న మనసు లో జరిగే దాన్ని పట్టుకోవడమే ముఖ్యం నాలాంటి మామూలు మానవుడి కి.
// ఉన్న భయ ద్వేషాసూయల్ని చూస్తే, చిన్నతనపు అబ్యూస్ వల్లనో, ఆ సంక్షోభ బాల్యపు ప్రేమ రాహిత్యం వల్లనో అనిపిస్తుంది. ఇట్లా లీనియర్ గా కారణాలు వెతకడం ఎంత ఆనందం ? కారణం వెతకడం అనే కాసల్ ఆపరేటర్ మెదడు లో వైర్ అయిపోయి ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. డోర్ బెల్ మోగగానే తలుపు తీయాలంటే ఈ ఆపరేటర్ అవసరం. శాస్త్ర జ్ఞానం పుట్టుక, పెంపు అంతా దీని వల్లే జరిగిందనేది స్పష్టం గానే ఉంది. ఈ కారణాలు వెతకడం వెనక ఏదో తెలియ రానిదీ, తెలియ లేనిదీ తెల్సుకోవాలన్న ఆకాంక్ష, అసంతృప్తి, అశాంతి..
* a new kind of science - by steven wolfram - ఈ పుస్తకం లో చివరికి చెప్పిన ప్రశంసలు బుద్ధుడు చెప్పినట్టుగా అనిపిస్తాయి.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home