2006-08-11

పరమ ప్రశ్న

11th Dec 04.

ఏమిటి ఈ జీవితానికి పరమార్ధం లేదా purpose అని ఎవరో అడిగితే కొంత సేపు ఊరుకుని "ఇదే- ఈ ప్రశ్న వేసుకోవడమే" అన్నాట్ట ఆయన. అంతే. ఈ ప్రశ్న లోనే ఉంది. అత్యంత తీవ్రమయిన ఆసక్తి తో, గాఢమయిన నిజాయితీ తో ప్రశ్న వేసుకోవడమే పరమార్ధం. ఆ తరవాత ఆ ప్రశ్న నిన్ను ఎక్కడి కయినా తీసుకు వెళ్ళవచ్చు. ఉన్న చోటే ఉంచవచ్చు. గట్టి గా ప్రశ్నించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అదే దాని సౌందర్యం.

*****
"What is Sacred ? Is there anything sacred at all ?" అని అడిగినప్పుడు చాలా సేపు మౌనంగా ఉండి పోయాడుట ఆయన.
"What is" is The Sacred అని చెప్పాడుట.
'నా ఆలోచన అన్న కదలిక' లేనిదీ,అంటనిదీ అన్న మాట - ఎదురుగా ఉన్నదీ. అనన్యమైనదీ.
************
పరాత్పర స్వరూపమంటే అర్ధం అడిగితే ఇలా అన్నాట్ట :
"పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యదార్ధమని అర్ధం"

1 Comments:

Anonymous అజ్ఞాత said...

good one !

11:01 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home