2005-05-02

ప్రదర్శకుడు

12/16/02
ఒంటరి ప్రయాణంలో దిగులు. చేయి అందించేవాడు ఉన్నా ఇంకోకడి వల్ల జరగకుండా నా (అలాంటి దేమన్నా ఉంటే) లోంచి రావాలని యావ. బేసిక్ ఒరిజినల్ 'నా' అనేది ఏమిటో ఆ బ్రహ్మ పదార్ధం ఎలాంటిదో మనకి తెలీదు.
ఇదంతా మెటాఫరికల్. అందించేవాడూ, ఇంకొకడూ, దిగులూ - ఇవన్నీ పదాలే. అసలు పాయింట్ మెదడు లో రగులుతున్న ఆందోళనలూ, భయాలూ, వడివడి గా పరిగెత్తే ఆలోచన - కోరికల వలయావర్తాలలో సుడులూ, సెగలూ, మారువేషాలలో వెంటాడే ముసుగు మనుషులూ, మాటలూ, పాటలూ - దీన్నంతటినీ దిగులు అన్న పదం సూచించగలదా ? ఇక దీన్నించి తప్పించుకుని పోయి, ఈ మంటని చల్లర్చకుండా ఆ వేడిని భరిస్తూ (దానిలో కాలిపోవడం, లొంగి పోవడంకాదు) బాధ పడడం - ఇంకోళ్ళని అనుకరించకుండా ప్రాక్సీ గా అనుభవించకుండా ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం.
///ఈ ప్రదర్శకుడి యావంతా ఏమిటి ? ప్రతి ఆలోచనలో, సంభాషణలో చూపులో కల్పనలో అన్నింటి వెనకా ఉండి నడిపించే ప్రదర్శకత్వం సాలెగూడు లాగా అల్లుకుపోయింది. ఎప్పుడూ ఇంకొకరు తన గురించి ఏర్పరుచుకోబోతున్న ఇమేజ్ గురించి ఆలోచించడం నా లో ఉన్న "ప్రదర్శించి లొంగ దీసే" అగ్రెషన్ కి నిదర్శనం. కదిలే ప్రతి ఆలోచననూ గమనిస్తూంటే - స్లో మోషన్ లో - బయట పడుతున్న చెడ్డతనం.