2005-05-03

ప్రసారం

2/14/03
ఇంకోళ్ళు చెప్పే మాటకీ సలహాకీ ( సహృదయంతో) విలువ అస్సలు ఉండదా? ఎవడిది వాడు చూస్కోవల్సిందే అనుకున్నట్టయితే కమ్యూనికేషన్ అంతా వృధాయేనా అని అడిగితే సమాధానం ? కాదు అనే. ఎవడికి వాడు తానుగా చూసి అనుభవించి తీసివేస్కోవలసిందే. కానీ అది ఏమిటో ఎరిగినవాళ్ళు చెప్పినపుడు వినేవాడు ఇంటెన్స్ అటెన్షన్ తో -'నేను' ప్రతిబంధకమవకుండా కనక వింటే అది హఠాత్తుగా అర్ధమవచ్చు. చెప్పటం, బోధన వీటి విలువ అప్పుడు తెలుస్తుంది. ఎవరో మహానుభావుడు " 'నేను' అని నువ్వు అనుకుంటున్నది నిజం కాదు" అని చెప్పగానే నిసర్గదత్తుడు గారు గుడ్డిగా నమ్మేసినట్లనిపించదు.. వేరే వ్యతిరేక ఆలోచనలేమీ లేకుండా సూటిగా దానిలోని సత్యాన్ని ఆయన చూసి అనుభవించినట్లనిపిస్తుంది.