పడమటి గాలి
18th Dec 05.
మొన్న సాయంత్రం ఒంగోలు స్పందన సమితి వాళ్ళాడిన పడమటి గాలి నాటకానికి వెళ్ళాం. సంభాషణలన్నింటా ఒంగోలు యాస.
పంచలో పాలు మాలడం, పారజూళ్ళేకపోవడం, కీతాగా, కిండలా, వాడిమీద పెట్టుకున్నాడమ్మా, బల్జెప్పావుగా, నీయమ్మా లాంటి ongolisms (ఇంకా కొన్ని పచ్చి బూతులూ) కొల్లలుగా ఉన్నాయి. అలానే సినిమా సెట్టింగుల హంగులు - మోటారు సైకిళ్ళు stage మీదకు రావడం, బావిలో పడడం, మెరుపులతో కూడిన వర్షం, అగ్నిప్రమాదం - చాలా చాలా సాంకేతికమైన పని కష్టపడి చేసారు. కానీ అంత ప్రయత్నమూ అసలు "సరుకు" లేక (నాలుగు గంటలు సాగదీయడంతో మరీ) వృధా అయిపోయింది. అనవసర అర్భాటాలు తీసేసి గంటకో గంటన్నరకో కుదించుకుని ఆడి ఉంటే బాగుండేదేమో. ఒక సాంకేతిక నాటకం గా మిగిలి పోకుండా ఉండునేమో.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home