2004-06-05

బుద్ధి - వాక్యం ?

5th June 2004
రాసిన వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ తిరిగి రాయడంఎందుకు? ఎందుకు మరింత అర్ధవంతంగా ఉంటాయి కొన్ని వాక్యాలు తిరిగి రాసినప్పుడు? అలా తిరిగి రాసేటప్పుడు బుద్ధి స్పందించే విధానం ఏమిటి? వాక్యాలు చదివి అర్ధంచేసుకునేటప్పుడు core బుద్ధి లో జరిగే process ఏమిటి?

ఏ శాస్త్రపు (కళలు కాదు) భవనాల అడుగున చూసినా మౌలిక బుద్ధినూత్రాలు కనిపిస్తాయి. తర్కం, లాజిక్ ఇలాంటి మాటలు ఇక్కడ సరి అయినవో కావో? కార్యం, కారణం ఇవే base units గా కట్ట బడ్డాయా ఈ శాస్త్రాలన్నీ? సరే కళల సంగతి వేరు అని తెలుస్తూనే ఉంది. ఆలోచిస్తే కళలలో సంగీతంకన్నా ' అవాస్తవమైన ' విషయం మరొకటి లేదన్నాడు కొ.కు.

కానీ ప్రతి శాస్త్రమూ ఏదో ఒక దశ లో కళ గా అనిపించకమానదు. కారణం ? ఈ 'బుద్ధి' అనే సాధనం కార్యం, కారణం అనే పునాదుల సహాయంతో ఎన్ని శాస్త్రపు భవనాలు నిర్మించినా అనలు ఈ బుద్ధి అనేదే కార్యం, కారణంతో నంబంధంలేకుండా 'హఠాత్తుగా' ఉనికి లోకి వచ్చి ఉండవచ్చు. దీనికి ఆది, అంతం, కార్యం, కారణం లేక పోయి ఉండవచ్చు.
అనంతావైః ప్రశ్నాః