స్తబ్ధత
2/23/03
అతి తీవ్రమైన నిరాసక్తి. ఏం చేస్తే పోతుందో మనసంతా మళ్ళీ ఎక్సైట్ మెంట్ తో నిండి గాలి లో ఎగరాలంటే ఏయే సంఘటనలు జరగాలో తెల్సు. కానీ అవి కావాలన్న కాంక్ష, ఈ మాంద్యం పోవాలన్న కోరిక బొత్తిగా లేనట్టుంది. కూరుకుపోయి ఆనందించడానికీ, విడివడి దానివంక చూడ్డానికీ మధ్య ఉన్న సన్నటి గీత మీద అటూ ఇటూ తిరుగుతోంది మనసు - నాల్గు రోజులుగా. బయటి ప్రపంచ సంబంధం లో ఉన్న స్తబ్ధత వల్ల ఇదంతా అని స్పష్టంగా తెలుస్తూ ఉన్నా, ఏ పనీ చెయ్యకుండా అసలు ఈ సంబంధం లోని స్తబ్ధత వెనుక ఉన్న భయాన్ని చూడాలను కుంటుంది మనసు. తీరని కష్టమైన కోరికలెందుకు దీనికి ? శరీరం అంతా అలముకుంటున్న భయద్వేషాల నించి తప్పించు కునే అవకాశం ఉన్నా పోదెందుకు?
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home