2000-03-11

వేదన

మరైమలైనగర్ -చంగల్పట్ - 1990

దేనికోసం ఈ తీవ్రమైన వేదనంతా
ఎవరికోసంఈ ఘోరమైన క్షోభంతా
జీవన ప్రాంగణంలో నాటకాలు ఆడీ ఆడీ
అలసిపోయి నిజాయితీ(?) సెలయేళ్ళ దగ్గ్గర
సేదదీరుదామంటే వైరుధ్యాల కాలుష్యం - బతుకంతా
తీపి జ్ఞాపకాల పాటగా కూర్చుకుందామంటే పలకని శృతి
వీరావేశం లో జీవితమంతా అర్పించుకునే వాళ్ళనిచూస్తే
సందిగ్ధపు లోయలో పడి తప్పుతుంది గతి.

స్పష్టత లేదు ఏ విషయం లోనూ జీవితం లో
ఏదైనా చేద్దామంటే లక్షల కాంట్రాస్టుల్లో
రంగురంగులుగా తిరుగుతుంటుందీ హృదయం
ఉబికి ఉబికి వస్తున్న రా త్రులూ పగళ్ళూ
అనుభవాల దొంతరగా మెదడులో
సుడులు తిరిగి కోల్పోతుంది సంయమనం
ఆరని కోరికలూ తేల్చుకోలేని విలువలూ
వీటి మధ్య మండుతున్న నెగడు - ఈ మెదడు