2001-05-15

ప్రదేశాలు

5/15/01
"i am listing out all the places that i have not visited and planning to go to all of them starting next weekend"
అంటున్నాడతడు.
ఈ లిస్ట్ లో "సెల్ఫ్" లేదా ?" అని అడుగుతున్నాడాయన.
**
మనసుని గమనించుకోవడానికి మించిన మోక్షం లేదు అని చెప్పారుట ఎందరో మహానుభావులు. కానీ లోపలికి ప్రయాణిస్తుంటె అగాధాలు, శిఖరాలు, లోయలూ, కోరికలూ, హింస, జాలి, ద్వేషం, ప్రేమ, అసంతృప్తి, కామం, లొంగుబాటు, జ్వలన, ధిక్కరించడం, నమిలి మింగాలన్న కోరిక, పొసెస్ చెయ్యాలన్న తీవ్రత.. వీటి ని సూటిగా చూడలేక ఏదో ఆక్టివిటీ తో నన్ను నేను మూసేసుకోవడం..

2001-05-05

పనామా టేలర్

5/5/01
నిన్న చూసిన సినిమా పనామా టేలర్ - పెద్ద విశేషం ఏమీ లేదు. ఎంతో మంది మహానుభావులు చెప్పిందే.. దేశభక్తి అనే విషం పేరుతో కొద్ది మంది మనుషులు ఎలా తమ గ్రీడ్ ని తృప్తి పరుచుకుంటారో.. క్విల్ అనే సినిమా లో మార్కస్ డి సేడ్ పాత్ర ని అంత బాగా వేసేడని జెఫ్ రష్ కోసం వెళ్ళినదే..

కొన్ని చిత్రాలు

5/5/01
ఇమేజస్ . కారు. ఇల్లు. స్టేటస్. ఇమేజస్. స్వామి - వేదాంతం - aura - అడ్యులేషన్.
ఇమేజస్. రచనలు- సాహిత్యం-గొప్ప వాళ్ళు. ఇమేజస్ . మధ్యాన్నం. బద్ధకం. పప్పన్నం. వక్కపొడి. నవల. లేత సుఖం. ఇమేజస్. ఎండ-తీవ్రం-తపస్సు-పూజ-మడి- పట్టుపంచె -వీధి వాకిలి . ఇమేజస్ (ఎప్పటివో) - కొండలు -చెట్లు-నిర్మానుష్యం-ప్రకృతి-మమేకం-అరుణాచలం.