2001-04-29

భయం

4/29/01
ఇక్కడ బతికేవాళ్ళలో ఎక్కువమందికి ప్రాజెక్ట్ భయం వెన్నాడుతూ ఉంటుంది. ఎప్పుడు అయిపోతుందో మళ్ళీ అక్కడి కి వెళ్ళి జీవిక కోసం ప్రయాసలూ, వదులుకోలేని స్టేటస్ సింబళ్ళూ, సహకరించని శరీరం, వాతావరణం - అన్నింటిని గూర్చిన భయం. ఇక్కడ ఈ ప్రదేశం లో ఇది ఈ రూపం తీసుకున్నదన్నమాట, ఎప్పుడూ ఏదో ఒక దాన్ని ఆలంబన గా చేసుకుంటుంది(ట !) ఆ భయం.. దానికి ఆధారం తీసేసి దాన్ని నేరుగా ఎదుర్కోవాలంటున్నాడు ఆయన..
ఈ తాత్వికులు పదేపదే ఘోషించే సోకాల్డ్ మెడిటేషన్ ని సంవత్సరాల తరబడి 'ప్రాక్టీసు' చేసినా ఎంతకీ ఏమీ మార్పు రావడం లేదనీ, ఏమీ రాలడం లేదనీ ఏడుస్తూంటే, దాన్ని 'coin' అని పిలిచి
దేని కోసమో ఈ ప్రాక్టీసులు చెయ్యొద్దనీ, ఏదో ఘనకీర్తి, మోక్షాల కోసం చేసే సర్కసు లు చివరికి అవి "చేసే వాడి" ని పెంచక తప్పదన్నాడు.

2001-04-14

సహజ

14 Apr 01.
ఏదో గర్వం గా feel అవుతాడు అప్పుడప్పుడు కనీసం నిజాయితీ ఉంది కదా (ఎట్ లీస్ట్ తనలో తనకి)
ఇంకేమీ లేకపోయినా- కానీ అది కొంచెంసేపే. దాని గ్లామర్ కొద్ది సేపే. హరించుకుపోతుంది త్వరగా. ..ప్రత్యేకంగా ఆనెస్టీ ఒక లక్షణం కాదనీ. తనపట్ల తనకి డిసానెస్టీ లేకపోవడం మహా అయితే ఒక సహజలక్షణం అవచ్చు కాని ప్రత్యేకం గా ఒక సుగుణం కాదని తెలిసిపోతుంది.
**
హోటల్ వెనక stream చేసే చప్పుడు ఎంతో బాగుంది. మన మనసులో ఇది విహార యాత్ర కాబట్టి మనం చూసేటప్పుడే అది ప్రవహిస్తోంది అన్న ఊహ అప్రయత్నం గా కలిగిందేమో. రాత్రి వేళ కిటికీ లొంచి చూస్తే పారుతూ ఉంది దాని పాటికి అది ఆశ్చర్యంగా. వేళలూ శెలవు దినాలూ లేవు దానికి.