సుజాన్ సీగల్
6/17/01
నాలుగురోజుల క్రితం చదివిన మంచి పుస్తకం. సుజాన్ సెగాల్ జీవితం*. పన్నెండేళ్ళ భయనివాసం చేసిందట తనలోని 'నా' మాయమై, దాన్ని వెతుక్కుంటూ.. తను తను కాదని తెల్సి ఆ భావనని ఇతరులకి చెప్పలేక, చెప్పకుండా ఉండలేక తీవ్రమయిన భయాన్ని అనుభవించలేక, పారిపోలేక..
ఎవరో మహర్షి చిన్న సలహా తో అంతా ముగిసింది. థింకింగ్ థింక్స్, మదరింగ్ మదర్స్, సీఇంగ్ సీస్, డ్రైవింగ్ డ్రైవ్స్ - చాల కష్టమే అనుభవం లోకి రావడం. అన్ని విషయాలనీ, దేనిది దానిది గా చూసేసి అనుభవించేస్తూ ఉంటె, వాటిన్నిటి మధ్యా కామన్ గా ఉన్న 'నేను' తెగిపోతుంది లేదా తగ్గిపోతుంది.
**
రోడ్డు మీద బుద్ధుడు కనబడితే చంపేయండి అంటున్నారట జెన్ మహాశయులు. ఎందుకంటే గుళ్ళూ గోపూరాల్లో బంధించి పూజిస్తారని.. కానీ వదిలించుకోవాలని చేసే ప్రయత్నమే తప్పు గా కన్పడుతోంది. ఎలా His ఇమేజ్ లేక రూపం, ఆదర్శం, ఆలోచన మనసుని పట్టుకుందో
'చూడడమే' అన్నిటికన్న ముఖ్యం.
*suzanne segal - collision with infinite..