2001-02-24

కాల భయం

february 2001

బ్రతుకు కోసం ఉండే ఈ నిరంతర భయం అనుభవించని మానవుడు లేడన్నాడు ఆయన. ఈ నిరంతర భయాన్ని 'రేపు భయం' లేదా ఆలోచనా భయం లేదా కాల భావనకి కల్గిన ఫలితం అని రకరకాలుగా పేర్లు పెట్టొచ్చు. కానీఅసలు ఈ feeling ని ప్రత్యక్షం గా చూడగలగాలి - మాటలద్వారా కాదు. అది నీకు జీవిక రూపం లో ఇంకోళ్ళకి కీర్తి లేదా డబ్బు, జబ్బు, ఒంటరితనం లేదా ఇంకోటేదైనా - ఏదో ఒకటి గా ప్రత్యక్షమవుతుంది ఈ భయం. - భయపడు. పూర్తిగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించు. పారిపోకుండా. time constriants పెట్టుకోవద్దు భయాన్ని ఫలానా రోజుకల్లా అధిగమించాలని.
మనసుని సరిగా అర్ధం చేసుకున్నవాడెవడైనా అసలు అధిగమించడం అనే concept తప్పు అని సులభం గా గ్రహిస్తాడు.

2001-02-12

"నా" లో

12feb 2001
నాతో నేను ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.
కానీ నేను పరిగెత్తుతూనే ఉన్నాడు continuous గా..
రాస్తోంటే, చదువుతూంటే వేరే ఆలోచన
ఈ నేను ను ఆపాలని ప్రయత్నిస్తూన్న ఆలోచన !
ముందు సుఖాలు ఇచ్చే tools పొందాలని పోరాటం
తర్వాత సుఖాలు అనుభవించాలని ఆరాటం
ఆనక అసలు సుఖం అంటే ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నం
**
మనసుకు సమాంతరంగా శరీరం చేస్తున్న చప్పుళ్ళూ, వాటి గురించి ఆలోచనలూ..
కోరిక అంతు కనుక్కోవాలని ప్రయత్నం
అనుభవించడమే దానికి మార్గమైతే అలాగే కానిద్దాం
కానీ శరీరం కరప్ట్ అవకుందా, బాధ పడకుండా
కోరిక ని అలాగే చూడాలన్న (దుర్)ఆశ..

2001-02-07

మొదటి (చివరి) అడుగు

feb 6 - 12 2001
దట్ ఫస్ట్ స్టెప్ : ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు - చాలా జీవితాలలో రాక పోవచ్చు. ఆయన చెప్తున్నాడు. నో టైమ్, నో ఎవలూషన్, నో పాత్ అని . ఇక్కడ నో టైమ్ అంటే సైకలాజికల్ టైమ్ అని అర్ధం అయి ఉండవచ్చు. elapsed (that can be measured) time అని కాక పోవచ్చు. ఆ జల ఊరడం ప్రారంభమయ్యాక కొన్నాళ్ళు పట్టవచ్చు. ఈ ఆలోచనలూ (లేక ఆలోచనలు లేకపోవడాలూ) అన్నీ ఒక స్థితిని తేవడానికి.
ఎప్పటికి విముక్తి అని అడిగిన ప్రశ్నకి ఇట్ మైట్ టేక్ థౌజండ్ ఇయర్స్ బట్ నో టైమ్ ఈజ్ రియల్లీ నీడెడ్ అని చెప్పాడు ట నిసర్గదత్తుడు. అంటే దాన్ని సూటి గా ఎదుర్కొని 'నేను' ఏమీ చెయ్యలేనని మౌనం వహించే ఈవెంట్ జరిగే క్షణం రేపో వెయ్యేళ్ళ తర్వాతో జరగొచ్చు. కానీ ఆ క్షణానికి ముందున్న క్షణం తో సంబంధం లేదు. కొనసాగింపూ కాదు.
ఎవరో చెప్తున్నారు try to be aware of your legs while walking..
Can we be aware of our eyes (at least for some time ?)

2001-02-04

దొంగతనం - అఘాతం

4th Feb 01.

ప్రక్కింటి స్నేహితుడి కారు దొంగతనం - పట్టపగలు కళ్ళముందే - భయం, అయోమయం, అపనమ్మకం...

we all met for lunch.. as usual, bad things become so attractive..ప్రశ్న, జవాబు - ప్రశ్నలూ, జవాబులూ, మరిన్ని ప్రశ్నలూ, మరిన్ని జవాబులూ.. ఏదైనా అనుభవం, "నేను" తో కలుషితమయి బయట పడే వ్యాఖ్య..

మన చుట్టూ తిరిగే వాళ్ళలోనే ఒకడు అలా చులాగ్గా మన ఆస్తి ని అపహరించాడంటే - ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్..
జీవితపు సిస్టం కి తగిలిన ఈ దెబ్బ (చిన్నదే కావచ్చు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ) వల్ల కలిగిన అలజడి, అపనమ్మకం - మెటీరియల్ గా డిపెండ్ అయిన దానికే ఇంత బాధగా ఉంటే ఇంక
సైకలాజికల్ గా డిపెండ్అయిన వ్యక్తులు పోతే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ?
-- ఎలా జరిగింది ? ఎలా పోయింది ? ప్రశ్నల పరంపర - వివరాలూ, వ్యాఖ్యలూ.. - అన్నీ అయినాక కడుపు నిండా తిండి. ఎవడో లావుపాటి వస్తాదు లాంటి వ్యక్తి గున్న లాగు నడుచుకుంటూ వచ్చి ఎత్తుకుపొయిన దృశ్యం మళ్ళీ మళ్ళీ మెదులుతోంది. ఈ భయాన్నీ, కోపాన్నీ, ద్వేషాన్నీ - ఏమీ బయట పడడంలేదు లోపల ఉన్నట్టుగా తెలుస్తోంది - మళ్ళీ రికార్డ్ అవకుండా ఇప్పుడే అనుభవిస్తే ? ఏమిటి ఈ అనుభవించడం ? పుస్తకాల్లో చదివిన మాటలా లేక నీ అంతట నీకు కలిగిన ఆలోచనా? ఇలా చేస్తూ పోతే అలజడి తగ్గడం తెలుస్తోంది.
- ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఎందుకో సిస్టం మీద ఉన్న నమ్మకాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బజారుకో హోటల్ కో వెళ్ళాలనిపిస్తుంది. ఏదైనా తినీ, తాగీ ఈ సంఘటన ని డైలూట్ చెయ్యలనా ఈ ప్రయత్నం?
మన కళ్ళ ముందు జరిగిన ఈ అబెర్రేషన్ నించి 'ప్రపంచం అంతా బాగానే నడుస్తోంది' అనే ఫీలింగ్ సహాయం తో పారిపోవాలని ఈ గొడవంతా .. అదే పక్కవాడి కారు కాక నాదైతే? అప్పుడు వేరే రకమైన భావాలు కలుగుతాయా ?