2005-05-03

కళ్ళు

3/14/03
నిన్నా మొన్నా అమితమైన బాధతో అశాంతితో నిద్ర పట్టక దొర్లుతూంటే ముసురుతున్న ఆలోచనలు తల నిండా.. అకస్మాత్తుగా కొన్ని క్షణాలలో ఎక్కడి నించో పొడుస్తున్న అక్షర సముదాయాలు.. కవి తను రహస్యంగా అసహ్యించుకునే వాటిని.. ఇంకా ఏవేవో మాటలు చప్పున గుర్తుకు రావడంలేదు. ఏమైనా ఆ ఉద్వేగం లో రాయాల్సిందే కానీ వాటిని సొంతం చేసుకుని ప్రయత్నించి (అంటే గుర్తుంచుకుని) తరవాతెప్పుడో రాయాలంటే పాచి పోయిన అన్నంలో రుచి వెతుక్కున్నట్టు గా ఉంటుంది.. ప్రస్తుతానికి తోచింది రాస్తే..
కొన్ని రోజులుగా చెడ్డ ఆలోచనల సర్పం కాటు తిన్న మెదడు లో ఉత్పన్నమైన బాధ అంతా శరీరం అంతా వ్యాపిస్తోంది ఒక మనిషికి. "యాగ యోగ త్యాగా భోగ ఫలమొసంగే.. అని మొహం కండలు ఉబికిస్తూ అతి తీవ్రమైన అగ్రెసివ్ మైండ్ తో పాడుతూ ఒకడు. "అమ్మా, అయ్యా, ఆ.. " అని నచ్చు స్వరం లో గుమ్మడి పాత్రని అనుకరిస్తూ ఇంకొకడు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని గంటలు అని తక్కెడ లో బిల్లింగ్ రాళ్ళు ఒకవైపు వేస్తూ, ఇంకొకవైపు మనషుల్ని(అనగా కన్సల్టెంట్స్) తోలుతున్న ఒక అధికారి (అనగా మానేజర్) - అబ్బా ఆ సెట్టింగ్ రాకపోతే ఇది ఎలా నడుస్తుంది? వాడికి దాన్నిగురించి ఉత్తరం పంపావా అంటున్నారు ఇంకొకరెవరో. అనేక వందల సముదాయాల ఆలోచనలతో మండుతున్న నెగడు ఈ మెదడు.

కళ్ళు - we would not have eyes had we all not been part of the same god (or its debris?) అంటున్నాడెవడో. కళ్ళ మీద కత్తులతో వత్తినట్లుగా ఉంది ఈ భయం చేత. I can see how my eyes are affected by my mind. తప్పు జరిగితే కళ్ళు పోతాయన్న మాటకి అర్ధం తెలిసినట్లుగా ఉంది. One thing that is so extremely difficult is to keep this emotion without reacting and also see it without running away nor enjoying it.. ఈ భయం on its own enjoyable కాకపోయినా అది తెరిచే ద్వారాల గుండా ప్రయాణిస్తే వచ్చే sensual satisfaction కి లొంగి పోకుండా (అంటే జంతు ప్రవృత్తి ని తృప్తి పరచే వయొలెన్స్ కి సరెండర్ అయి పోకుండా ఉండడం ఎంత కష్టమో తెలుస్తోంది. భయం కళ్ళని ఇలా వత్తిడి కి లోను చేయడం కాక ; - భయం తోనే జీవించాలనీ ఇంకెక్కడికీ పారిపోకూడదనీ చేసే ప్రయత్నం లో వచ్చిన రెసిస్టెన్స్ అయ్యుండవచ్చు ముఖం అంతా నొక్కుతున్నట్లు అన్పిస్తున్న ఈ భావన.
ఆధునిక మానసిక శాస్త్రం ఇలాంటి రాతల్ని చూస్తే ఎన్ని జబ్బుల పేర్లు ఏకరువు పెడతారో.

ఏది నిజం ఏది అబద్ధం ఏది ప్రమాణం ఓ మహాత్మా ఓ మహర్షీ ..
//ఎందుకని ఆధ్యాత్మికానికీ ఈ సోకాల్డ్ ఆధునిక సమాజ జీవితానికీ పొసగదు జనరల్ గా? నాలో ఉన్న సమస్త భావాల్నీ వేటికి వాటిని విడిగా చూస్తూ అనుభవిస్తూ జీవిస్తూ ఉండాలంటే ఆధునిక సమాజంలో అవకాశాలు తక్కువయిపోతున్నై. When I have fear, elation, anger, goodness, violence, benevolence – I am not supposed to display them as they are. Of course, చాలా కొద్ది మంది ఉన్నత సంస్కార జీవుల మధ్య కుదరచ్చు. కానీ నూటికో కోటికో ఉంటారు అటువంటివారు. ఎక్కడికక్కడ భావాలని అణచుకొని ధన సంపాదన కోసమో ఇతర material practical considerations కోసమో పరుగులెత్తాల్సొస్తూంటే తీరి కూర్చుని సెల్ఫ్ లోకి వెళ్ళే వీలెక్కడ
?