2005-05-06

మొదటి నేను

July 1st 03.
ఏమీ బరువులు లేని తేలిక తనం, స్పష్టమైన చూపు, ప్రశాంతత ఉన్నప్పుడు రాయాలని పెద్దగా అన్పించదు. మరీ ఎక్కువ శక్తి పిడుగులు పడుతున్నట్లుంటే తప్ప.
// నిజమే. అన్ని ఆలోచనల్లోనూ అంతర్లీనంగా "మొదటి నేను" ఉన్నట్లే ఉంది.
// ఇరవై కోట్లసం వత్సరాల నాటి పెద్ద బల్లుల శిలాజాలు దొరికాయట ఆదిలాబాద్ జిల్లాలో. నిజంగా పేరు లోని "ఆది" సార్ధకమయినట్లుగానే ఉంది.
ప్రస్తుతం తల లో ఖాళీ. నెమ్మదిగా (బాల్యపు) ఆం. శర్మ గారో అ. నారాయణ గారో దిగుతారు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా వాళ్ళ తీవ్రత, ఆగ్రహం, స్వార్ధం, వెకిలితనం నాలో తెలుస్తున్నాయంటే ఈ పంతుళ్ళూ, నాన్నలూ, అగ్రజులూ అందరూ నేను సృష్టించి ఆహ్వానించిన వాళ్ళే. మృదుస్వభావులెంత మంది తగిలి ఉంటారు ? వాళ్ళ faculty లు అతుక్కోలేదేమి ఇంత గాఢంగా
?