2005-05-05

ప్రవాహం

6/14/03
పోయిన శనివారం సుధా రఘునాధన్ కచేరీ కి వెళ్ళాం. మధ్యాహ్నం మూడున్నర కి ప్రారంభించి రాత్రి తొమ్మిదిన్నర కి (మేం లేచి వచ్చేటప్పటికి) కూడా పాడుతూనే ఉంది. సంగీతం ప్రవాహమై ముంచెత్తింది ప్రేక్షకుల్ని. లేచి వెళ్ళేముందు స్టేజ్ కి దగ్గరగా వెళ్ళి పది నిముషాలు కూర్చున్నాం. అమితమైన శక్తి స్వరూపాల్ని దగ్గరగా చూడ్డానికి. మోర్సల్ వాయించిన ఆయనకి పెదవి చిట్లిందిట.