2005-05-03

స్వాభావికం

April 5, 03.
మాతృభూమి లో పడ్డాం… . sudden change in atmosphere. extreme heat – desultory gossip talk. ఒక్క నిముషం నేను పూర్వం పడ్డ బాధ పది రెట్లు మాగ్నిఫై అయినట్లు అనిపిస్తోంది. అమితమైన వేడి అలుముకొన్న ఈ కొలిమి లో - బలమైన సమ్మెట పోట్లు - సాధింపులు - భయ కార్పణ్యాల వెనక దాగి ఉన్న అసలు ? ఆర్ధికానికి అమిత భయంకరమైన ప్రాముఖ్యం ఇచ్చు కోవడం వల్లనా ఈ స్వీయ రక్షణ కవచాలు ఏర్పడ్డాయి మనుషుల మధ్య ? లేక అది ఇటా (వైస్ వెర్సా?)
మురికి ఇరుకు గదులు - వేడి - చట్టున వీచిన శీతల పవనం - మళ్ళీ అమితమైన వేడి - ఒక చిన్న పెళుసు మాట పైపైనే - అంటుకున్న నిప్పురవ్వ - తారాజువ్వ లా ఎగిసిన ఎమోషన్స్.. ముదిమి చేత మైల్డ్ అవబడ్డ భావాలు. డైల్యూట్ అయిపోయి మనసుకు అందకుండా చేజారి పోతున్న క్షణాలు. మళ్ళీ గ్రీష్మ తాపం. కొంచెం చల్లని గాలి. చదువు చెప్పించుకున్న బాలిక.
కళ్ళూ మిరుమిట్లు గొలిపే సంపద, అనేక వృక్ష, పుష్ప, ఫల జాతులతో కూడిన విశాలోద్యానవనపూరితమైన ప్రదేశాలలోంచి ఒక్క సారిగా ఇరుకు గదుల మనసులలోనికి వెళ్ళినా ఏమీ వ్యతిరేక భావం కలగదు. చప్పున అర్ధమవుతున్న 'స్వాభావికం' అన్న మాట.