దృశ్యాదృశ్యం
4/25/03
మిట్టమధ్యాన్నం. బద్ధకంగా కనిపిస్తూ నడుము వాల్చిన ఎద్దు. పెచ్చులూడి పోయిన రెండు మట్టి గోడలు. అక్కడక్కడా పడి ఉన్న కొబ్బరిమట్టలూ, చిప్పలూ. ఎండవేడి. వేపచెట్టు. ఓరగా వాల్చిన బండి. గూని తో వంగి నడుస్తున్న ముసలమ్మ. మట్టికుండలు. పెంకుటిళ్ళు. కొబ్బరిచెట్లు. నా ఆలోచన తప్ప ఇంకే శబ్దమూ లేదు. అప్పుడప్పుడు పక్షుల అరుపులు తప్పితే. కొంచెం సేపు పెద్దగా నవ్వు - కారణం తెలీకుండా. గాలీ, ఇల్లూ, పొలాలూ, ప్రకృతి శబ్దాలలోని నిశ్శబ్దం. ఇదంతా సెన్సుయల్ ప్లెషర్ గా ఫీలవడం తెలుస్తోంది.
మట్టి రోడ్డు మీద సైకిలు పోతున్న శబ్దం. పాత గోడలు. కొంచెంమసి బారిన పాత్రలు.
గడ్డి వాము దగ్గిర నెమరు వేస్తున్న బర్రె. కళ్ళతో దృశ్యాల్ని తాగడం ఆ అనందం మెదడుకు సరఫరా అవడం అంతా స్పష్టంగా తెలుస్తోంది.
// చురుక్కుమంటున్న చూపులు - ప్రతి మనిషి కళ్ళలోకి చూస్తూ అతని మస్తిష్కాన్ని వెతకడం - ఏదో జీవశక్తి చటుక్కున బయటికి రావడం - అప్రయత్నం గా వచ్చే ఒక చిరునవ్వు.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home