2005-05-06

గీతార్ధం

7/13/03
నీరవపు మధ్యాహ్నం లో అనుకోకుండా దొరికిన బద్ధకపు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ "రాజ శేఖరా నీపై మోజు తీరలేదురా" అన్న పాట వినడం. ఈ రాజు లేదా రాజ శేఖర్ అనే వాడి యొక్క అనేక ఆలోచనా రూపాల్నుండి వెలువడుతున్న సుఖ దుఃఖ ఛాయల్ని సంపూర్ణం గా అనుభవించడం ఇంకా పూర్తి కాలేదు అన్న అర్ధాన్ని అన్వయించుకుని పాడుకుంటూ విరగబడి నవ్వుకోవడం.