2005-05-19

ప్రయత్నం

1/21/04
ఇంక వేటినీ సప్రెస్ చెయ్యడానికో ఎంకరేజ్ చెయ్యడానికో ప్రయత్నించకుండా డైరెక్ట్ గా సరిగ్గా ప్రయత్నంచేసే వాడి వెనక ఉన్న దాన్ని చూడమన్నాడు అతను. ఇంత కన్న deep గా మాటల్లో పెట్టడం కష్టమే అనాల్సొస్తుంది - వెనక చూడటం ప్రయత్నం కాదా అని అడిగితే.
//ప్రత్యేక సంఘటనలూ, వ్యక్తుల ప్రస్తావన లేకుండా సూచిక లాంటి మాటలతో మెదడు లో జరుగుతున్న భావాన్ని abstract గా చూడటమే కవిత్వమా ?
// దాగుడు మూతలతోనే జీవితమంతా జరిగిపోతే ?
లోపలి అసలు చూడకుండా - ఏమీ లేదని తెలుసుకోకుండా
చూసే కోరిక మాయమవకుండా జీవితం గడిచి పోతే ?
అదుగో - ఏమీ లేదని తెలుసుకుంటున్నానన్న జ్ఞాపకాన్ని
భద్ర ప్రరుచుకుంటోంది నేను.

// మొట్టమొదటి భయం- వాడేదో అంటాడనీ ఇదేదో అవుతుందనీ వాడూ అదీ అలా
ప్రవర్తిస్తారన్న ఊహకి కారణం నా స్వభావమే. నిజంగా అది జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఎదుర్కోవడం వేరు - అది భయంకాదేమో. వాడు నన్ను తిడతాడో, కొడతాడో లేదా అసూయ పడతాడో అన్న భయ భావన కి కారణం 'వాడు' కాదు. నాలో ఉన్న వాడి అంశ. ఇంకా deep గా ఆ భయాన్ని ఆవాహన చేసుకొని అవధరిస్తే ఆ భయ పు సంఘటన ని కలుగజేసే ప్రవర్తన ని వదలలేక పట్టుకుని నేను వేళ్ళాడుతూ ఉండటం వల్లే అని ఇదంతా అని తెలుస్తుంది. ఇది ఒకసారి అనుభవంలోకి వచ్చింతర్వాత జ్ఞాపకంగా మారి భవిష్యత్తులో గ్రహించే శక్తి ని పోగొట్టడం కరప్ట్ చేయడం తెలుస్తూంది. 'నేను' కీ జ్ఞాపకానికీ ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకుంటే ఇది జరగక పోవచ్చు.
// రేపు, భవిష్యత్తు అనేవి అబద్ధపు మాటలనీ, పరిమిత ప్రయోజనం కోసం పుట్టించబడ్డవనీ అర్ధం అవుతుంది గ్రహించగలిగితే.
// అన్ని రకాలకీ ఇది వర్తిస్తుందా ? అచ్చంగా external object యొక్క ఉనికీ లేదా ప్రవర్తన వల్ల జరగబోయే హాని తెలుసుకున్నప్పుడు కలిగే భావం - నీలోంచి పుట్టిన భయం కాక పోతే దాన్నించి దూరంగా వెళ్ళిపోవడమే ఉంటుంది. అప్పుడు భయం ఉండదు.