2005-05-14

దూరం లేని కాలం

Jan 7, 04.
మనసులోని కాల భావన నిజం కాదన్న మాట లో ని నిజాన్ని ఎంతో కొంత తెలుసుకోగలం మెదడుతో. ఏదో కొంచెం తంటాలు పడితే. కానీ space (అనగా దూరం లేక ఖాళీ అందామా) కూడా నిజం కాదంటాడే కొండ దగ్గిరున్న మహర్షి ? ప్రతి క్షణమూ ఈ లోకం లో అనేక సంభావ్యతలు (possibilities) హఠాత్తుగా collapse (అనగా materialise) అయి మళ్ళీ హఠాత్తుగా vanish (లేక de-materialise) అవుతూ ఉంటాయని ప్రత్యక్షంగా తెలిస్తే అప్పుడు అర్ధమవుతుందేమో. అసలు కాల భావన వల్లనే దూర భావన కూడా కలుగుతోందేమో.