వేవ్ ఫంక్షన్
11/13/03
భయం ఎందుకా ? నాకు నచ్చే పాటర్న్స్ తో నేను నిర్మించుకున్న భవనాలని కూలదోస్తారేమోనని - నా ఆలోచనలనీ, భావాలనీ కాదని నన్ను నిర్భందిస్తారని, స్వాతంత్ర్యం అని నేను అనుకుంటున్నదేదో పోతుందనీ. నేను నా పాటర్న్స్ నీ, ఆశయాలనీ, ఫలానా రకంగా ఉండాలన్న కోరికని పెంపొందించుకునేటప్పుడే వాటికి వ్యతిరేకంగా ఒక భయం, విరోధం లేదా వైరుధ్యం నాలో ఏర్పడిందేమో. అదే ఇప్పుడు అనేక సంఘటనల , వ్యక్తుల వల్ల నా ఆలోచననీ భయం వైపు ఆక్టివేట్ చేస్తోందేమో.
నేను మునుపు ఎవరివో కూల ద్రోసాను అందు వల్ల నా పాటర్న్స్ ఇప్పుడు కూలుతున్నాయి అనుకోవడం ఒక రకమైన సంతృప్తి కలిగించే ఆలోచనా ధోరణి. అసలు నా పాటర్న్స్ కట్టేటప్పుడే, నాకు అనుకూలంగా ఒక ధోరణి ని మలుచుకుంటున్నప్పుడే, నాసొంతమనీ నా అధికారమనీ, ఇలాంటి బీజాలు పడినప్పుడే (ఇదంతా తప్పు అన్న ఉద్దేశంతో కాదు రాయడం) ఈ భయానికీ దుఃఖానికీ బాధకీ పొటెన్షియల్ పాసిబులిటీ ఏర్పడింది. అదే ఇప్పుడు confirm అయింది. (అంటే అదే దో క్వాంటం సిద్ధాంతం ప్రకారం wave function collapse అయిందన్న మాట).
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home