2005-05-14

అడుగులు

11/10/03
ఉద్వేగం ఆపు కోలేక అబద్ధాలు చెప్పడం - పాపం ఈ కుటుంబాలకు పుట్టుకతో సంక్రమించిన గుణం. ఇదేకదా కల్పనా కళ గా పరిణమించి (కొండకచో పరిమళించి) మరి కొన్ని మానవ సమూహాలను ఉత్తేజితుల్ని చేసింది !

//ఏమిటి తేడా అడుగులు వదులుతూ పని చేయడానికీ, ముద్రలు వదలకుండా జ్ఞాపకాలలో బంధించకుండా, పనిని తనలో ప్రవహింపజేయడానికీ ?
చేయాల్సిన పని చేయలేక ఇంకేదో పుస్తకాన్నో, సినిమా నో పట్టుకోవడం. భయం తో బాధతో
ర గులుతూ, ఏదో ఘోరం చేస్తున్నానన్న జ్ఞాపకం పోగు చేసుకుంటూ ఆ పని చెయ్యడానికీ, అలాంటి భావాలు ఏమీ లేకుండా - ఏదో అసలు పని చేసే శక్తి పోయిందనుకుంటూ హాయిగా సుఖించడం - ఈ రెండు మార్గాల లోనూ భౌతికంగా జరిగేది ఆ సమయానికి ఒకటే. అయినా మనసులో మెదడు లో ఆలోచనల ఫలితంగా ఏర్పడిన ముద్రల వల్ల తరువాత జరిగే అసంఖ్యాక మయిన సంఘటనల వరసలు ప్రభావితమై ఆయా జీవితాలని వేరు వేరు మార్గాలు పట్టిస్తాయనేది స్పష్టం.