2005-05-14

భ్రమణం

9/30/03
చవుటుప్పల్ అన్న మాటని పదేపదే అనాలన్న కోరిక. అనోయా అన్న పేరు ని వినగానే మే మే అని అరుస్తూ అనోయామే - చకమే - మరణమే - శరణమే అని తల నిండా తిరుగుతున్న మాటలు.
ప్రాచీన పెంకుటింట్లో నల్ల కర్ర దూలాలున్న వంటగది. ఇంటికొచ్చి గొప్ప ప్రదర్శించాలనుకున్న మనుషుల్ని (వీళ్ళందరూ తన తల లోంచి ఊడి పడ్డ భాగాలే) భీకరంగా భయపెడుతూ గర్జించాలన్న భావన. సహజాధిక్యతా భావాలు - ఇవి దేశాధ్యక్షుడివైనా, కుంఫిణీ అధికారి వైనా, సామాన్య గుమాస్తా వయినా - తమని చూపించుకుంటూనే ఉంటాయి దినచర్యలలో.