2005-05-14

శరీరపుటాలోచన

11/25/03
ఏదో జర్నల్సూ, అసైనమెంట్లూ రాయడం. నోరు తిరగని, బుర్ర తిరిగే పొడుగాటి వాక్యాల్ని చదివి నైసు నైసు గా మళ్ళీ అనలైజ్ చేయడం.
// తల నిండా ఉన్న కనపడని చిన్న చిన్న రంధ్రాల్లోంచి పొగ లాగా బయల్వెడలుతున్న ఆలోచన కాలానికి కారణమని తెలుస్తూనే ఉంది. కాలంఅంటే మన మధ్యనున్న ఊహలూ, సంబంధాలూ, పోరాటాలూ ఇంకా కంటికి కనపడుతున్న వస్తు సముదాయాలూ..
// ఈ రాతంతా ఎక్కడి నించో తల లోకి ప్రవహిస్తోందన్న ఆలోచన.
// ఏదో కొంచెం అటూ ఇటూ పని చెయ్యడం కాకుండా నిజంగా అటెన్షన్ ఇచ్చి పని చేసినప్పుడు ఇతర భయాలూ, అజిటేషన్స్ మాయమవుతాయి. (అలా మనసు పెట్టి చేయగలిగే పని కుదిరినప్పుడు) అలా మాయమయిన సమయంలో 'ఇది' మిగులుతుంది. కాలాన్ని పెంపొందిచాల్సిన ఆలోచన కదలక మెదలక పడి ఉంటుంది. స్వగ్రామం లో నిశ్చలంగా ఆవరించిన మధ్యాహ్నాలూ, వేడి గాలితో కూడిన శరీరపుటాలోచనా ముందు కొచ్చి నిలబడతాయి.