2005-05-14

ప్రవాసులు

Jan 13, 04.
There is a certain strange peace or lightness that comes from the detachment to surroundings in a foreign country. You just tend to focus on your own existence, affairs and very few people. This might be one of the reasons for immigrants’ success.
ఇక్కడి సమాజం లో జరిగిన, జరుగుతున్న సంఘటనలూ, అక్రమాలూ అంత అఫెక్ట్ చెయ్యవు. ఒక క్రీడ కోసం వేల లక్షల మంది వీరావేశ పూరితులై రాక్షసంగా ప్రవర్తించారన్న వార్త - అమెరికా లో జరిగితే అస్సలు ఇక్కడ ప్రవాసుల మనసులో కి వచ్చి నట్టు కనిపించదు. అదే అక్కడ జరిగే ప్రతి అన్యాయమూ ఎన్నో రోజుల పాటు వెంటాడుతుంది. మన సమాజం, మనుషులూ ఎటు పోతున్నారన్న ప్రశ్నలూ అది కలిగించే అమితమయిన భయం కనిపిస్తుంది అందరిలోనూ. ఇక్కడ సమాజ పరిస్థితులతో ఎక్కువ మందికి ఉండే డిటాచ్మెంట్ (కనీసం మొదటి తరం ప్రవాసులలో) చాలా వరకూ కారణమేమో వాళ్ళ విజయానికి.