ఆరంభం
1/22/04
This huge interdependence looks and might feel very good at times. ఇంకోళ్ళతో సంబంధం లేకుండా జీవించలేననీ - మానసిక భౌతిక అవసరాలు తీరడానికి ఎన్నో interconnections సరిగా పని చేయాలనీ - ఈ కనక్షన్స్ అన్నీ ఇలాంటి ఎన్నో human systems మీద ఆధార పడ్డాయనీ తెలిసినప్పుడు కలిగే భయం. వాళ్ళందరూ instable అయి ఉండొచ్చన్న అనుమానం - దాని వెనక ఉన్న తీవ్రమయిన స్వార్ధం అర్ధమవుతూనే ఉన్నాయి.
// attentive గా, passion తోటీ, ప్రేమ తోటీ ఉన్నప్పుడు ఇట్లాంటి భయాల గొడవ ఉండదు. నిన్న బిల్ క్లింటన్ గారు చెప్తున్నారు (వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ లో) isolation, interdependence, integration అనే స్టేజస్ గురించీ ఒక దాన్నించి వేరొక దానికి human race ఎలా ట్రాన్సిషన్ అవుతోందీ - అవాలీ etc.,
// భయ పడుతున్నప్పుడు ఆ భావం ఎదుటి వారిలో ఎంత త్వరగా భయపెట్టాలన్న కోరిక ని activate చేస్తుందో అనుభవ మయిన విషయమే. దీని వల్లే భయపడే వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళని భయపెట్టే వాళ్ళుగా రూపొందుతారు.
// switch నొక్కగానే టప్పున వెలిగిన మానిటర్ - ఎలక్ట్రాన్స్, శక్తీ, దాని నిత్యత్వ సూత్రాన్నీ జ్ఞాపకం చేసి; తెర మీద కనబడుతున్న అక్షరాలకి కారణమైన లాప్ టాప్ కంప్యూటర్ నీ, మొట్టమొదట దాన్ని ఆలోచనగా కలిగించుకున్న ఆడమ్ఆస్బార్న్ నీ - మళ్ళీ అక్కణ్ణించి దాన్లో మూల సూత్రాన్ని conceive చేసిన బాబేజ్ అన్న వ్యక్తి యొక్క మెదడు లో న్యూరాన్ల విస్ఫోటనాన్ని కలిగించిన జన్యువు ల మీదుగా …
///- - - కారణాలు వెతుక్కుంటూ ఉంటే దానికి అంతం ఉండదు ఎందుకంటే 'ఆరంభం' అన్నది మన మైండ్ లో పుట్టిన కాన్సెప్టే కాని నిజంగా లేదు కనక - అంటున్నాడు ఆశ్రమం లో మౌనంగా కూచున్న ముసలాయన.
//గోడల్లో గదిని వెతకడంలాగా ఉంటుంది - విశ్వం పుట్టుకని కాల ప్రమాణం లో చెప్పాలని ప్రయత్నించ బోవడం అంటున్నాడు కొ.కు.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home