అసలు ప్రకృతి
1/29/04
అసలు ప్రకృతి - మట్టి పెళ్ళలతో నిండి ఉన్న మెదడు వాతావరణం- శారీరక సుఖం వెతుక్కుంటున్న మధ్యాహ్నాలు - చెడ్డ అనో మంచి అనో పేర్లు పెట్టక పోతే - ఇదీ ఉంది ఇక్కడ జన్మ చక్ర స్వభావం లో. దీన్ని దాటుకోవాలనీ, అధిగమించాలనీ కోరికలు నిజానికి లేవు. అది అట్లాగే అనుభవిస్తే తీరిపోతుందేమో. లేని పోని మేధా విన్యాసాలు, చదువులూ, విజ్ఞానం, వివేకం - స్వయంగా వేసుకున్న అనేక ముళ్ళు. ఎవరికీ హాని తల పెట్టని కాంప్లికేషన్స్ లేని జీవితం కుదరక సమాజాన్నీ నాగరికత నీ విపరీతం గా పెంచేశారు - ఎవరికీ ఏమీ అర్ధం కాకుండానే. బహు వచనాన్ని జాగ్రత్త గా అర్ధం చేసుకుంటే నిజానికి అలా జరిగింది అనేక మంది ప్రత్యేక వ్యక్తుల వల్లనే. సరిగా దేన్నీ అర్ధం చేసుకోకుండా అనేక మందిమి పక్క వాళ్ళని చూసి పరుగులెత్తడం వల్లనే జరుగుతోందిదంతా ('సామూహిక అంశల్ని' ఆడి పోసుకోవడం కూడా అందులో భాగంలాగానే ఉంది)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home