వెనకాడే పదం
2/20/04
పదం తటపటాయిస్తోంది - మనసు పొరల్లో జరుగుతున్న సంచలనాన్ని తన లోకి తర్జుమా చేయడానికి. భయాలన్నీ మాయమయిన తేలిక తనం- ఎవరికీ ఎవరూ ఏమీ ఇవ్వక్కర్లేదనీ. మాటని జాగ్రత్తగా వింటున్నప్ప్పుడు కలిగే భావన.
మనసు, మౌలిక బాధల గురించిన కొన్ని ఆలోచనలివి. కొన్ని చోట్ల భాష, విషయాలూ మానసిక కల్లోలం కలిగించే విధంగా ఉండవచ్చు. ఆయా క్షణాలలో కలిగిన వివిధ మానసిక స్థితులనూ, అహం వేసే వేషాలనూ, ఆలోచనలనూ రికార్డ్ చేయడమే ఉద్దేశం. ఇవి జ్ఞాన విస్తారక ప్రతిపాదనలో, శాశ్వతసత్య తీర్మానాలో కాదు. "ఎప్పటికి అనుభూతమెద్దియొ - అప్పటికి అది నిక్కువంబె" (గురజాడ)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home