చూపు భాష
3/6/04
ఎవరో ఇద్దరు అపరిచితులు కూర్చుని ఉన్నారు పక్కపక్కనే. ఏదో waiting room లోనో అలాంటి వేరొక ప్రదేశం లోనో. వారి మధ్యలో ఏమీ కనపడదు - ఇద్దరు మంచి స్నేహితులు కూర్చుని ఉన్నా భౌతికంగా అలానే ఉంటుంది చూడ్డానికి. కానీ ఏదో ప్రసారం, అనుబంధం తెలుస్తూనే ఉంటుంది - చూపులో ఉండే భాష యొక్క శక్తి.
// ఇప్పుడు నాపక్కన ఎవరూ లేరు. ఒక మిత్రుడు వస్తే ఎంత మౌనం గా ప్రశాంతంగా ఉంటుందో, అదే ఇంకొకళ్ళు వస్తే ఎంత గందరగోళం గా ఉంటుందో ఊహించుకుంటోంది మనసు. ఈ మౌనం లేదా కలకలం నేను గత ప్రవర్తన వల్ల మెదడు కూర్ప రుచు కున్నవేనన్న మాట నిజం. సరే దాన్లో తప్పూ ఆశ్చర్యమూ లేవు. కానీ దాని కొనసాగింపు కదా అసలు సమస్య . ఎందుకని మునుపు జరిగిన సంఘటనల ప్రకారం వాళ్ళ ప్రవర్తననీ, దాన్ని అలానే మళ్ళీ కొనసాగించే సంఘటనలనీ ఊహించుకోవాలి ?