దుఃఖ వర్షీయసి
6/21/04
భ్రూమధ్యం లోపల
ఏదో ఖాళీ భాగంలో
మేఘం లాంటి మెదడు నించి
దుఃఖం వర్షిస్తున్న భావన.
దుఃఖపు చినుకులు హృదయం మీద పడి
సూదులతో గుచ్చుకున్నట్టు బాధ
భవిష్యత్తు చెప్తున్న భవిష్యత్తు
10 June 04
1987 చందమామ లో (పాతికేళ్ళనాటి కథ శీర్షిక కింద) ఒక మంచి కథ.. రాజు గారి కొడుక్కి ఒక ఐంద్రజాలికుడివల్ల హీనయోగం ఉందని చెప్పేరుట పుట్టగానే జ్యోతీష్కులు. అబ్బాయికి మూడోఏడు రాగానే వచ్చాడు ఒక యువ ఐంద్రజాలికుడు ఇంద్రజాల ప్రదర్శన ఇవ్వటానికే - పాపం చెడ్డ ఉద్దేశాలు ఏమీలేవు కానీ రాజుగారు అనుమానించి వాణ్ణి చంపించి వేస్తాడు. ఆ విషయం ఆ కుర్ర ఐంద్రజాలికుడి తండ్రికి తెల్సి పగతో నాలుగేళ్ళ రాజ కుమారుణ్ణి కిడ్నాప్ చేసి పదహారేళ్ళు పెంచుతాడు. చివరికి ఆ అబ్బాయి ని రాజే చంపించేట్టుగా పరిస్థితి కల్పించాలని ఆ తండ్రి ఐంద్రజాలికుడి పధకం. సరే కధ ఏదో సుఖాంతమే చివరికి.
కానీ జ్యొతీష్కులు ఆ అబ్బాయి భవిష్యత్తు అలా చెప్పడం కూడా వాడి డెస్టినీ లో భాగమే అనిపించక మానదు.
అలా చెప్పినందువల్లే రాజు గారు ఆ కుర్ర ఐంద్రజాలికుణ్ణి చంపించాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఏమీ అయి ఉండేది కాదేమో.
భవిష్యత్తు చెప్పడం అనే చర్య కూడా ఆ పొటెన్షియల్ పాసిబులిటీ ని నిజం చెయ్యడం లో ఒక భాగమే నేమో. కాల ప్రవాహపు ఈ ఒక్క క్షణం లో నేను అనే వాడిని ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉంటే, ఇక్కడి నించి కొన్ని వేల ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. మళ్ళీ ప్రతి ఒక్క సంఘటన అవతల లక్షల కాంబినేషన్లు .. వీటిల్లో మోస్ట్ లైక్లీ ఈవెంట్స్ ని ఎవడో ఊహిస్తున్నాడు.
ఇప్పటికే "నా" గతం లో ఉన్న జెనెటిక్ ప్రొపెన్సిటీ (జన్యు ప్రోద్బలం) వల్లనో లేక కార్మిక్ ప్రొపెన్సిటీ (కర్మ ప్రోద్బలం) వల్లనో అలా ప్రవర్తిల్లడానికి ఊతం ఇస్తున్నాడు.
***
"ముకుళ కరముల నాకు నే మోకరిలిన స్వీయవిశ్వాకార మగుపించనందా.. " (సిరివెన్నెల)
బుద్ధి - వాక్యం ?
5th June 2004
రాసిన వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ తిరిగి రాయడంఎందుకు? ఎందుకు మరింత అర్ధవంతంగా ఉంటాయి కొన్ని వాక్యాలు తిరిగి రాసినప్పుడు? అలా తిరిగి రాసేటప్పుడు బుద్ధి స్పందించే విధానం ఏమిటి? వాక్యాలు చదివి అర్ధంచేసుకునేటప్పుడు core బుద్ధి లో జరిగే process ఏమిటి?
ఏ శాస్త్రపు (కళలు కాదు) భవనాల అడుగున చూసినా మౌలిక బుద్ధినూత్రాలు కనిపిస్తాయి. తర్కం, లాజిక్ ఇలాంటి మాటలు ఇక్కడ సరి అయినవో కావో? కార్యం, కారణం ఇవే base units గా కట్ట బడ్డాయా ఈ శాస్త్రాలన్నీ? సరే కళల సంగతి వేరు అని తెలుస్తూనే ఉంది. ఆలోచిస్తే కళలలో సంగీతంకన్నా ' అవాస్తవమైన ' విషయం మరొకటి లేదన్నాడు కొ.కు.
కానీ ప్రతి శాస్త్రమూ ఏదో ఒక దశ లో కళ గా అనిపించకమానదు. కారణం ? ఈ 'బుద్ధి' అనే సాధనం కార్యం, కారణం అనే పునాదుల సహాయంతో ఎన్ని శాస్త్రపు భవనాలు నిర్మించినా అనలు ఈ బుద్ధి అనేదే కార్యం, కారణంతో నంబంధంలేకుండా 'హఠాత్తుగా' ఉనికి లోకి వచ్చి ఉండవచ్చు. దీనికి ఆది, అంతం, కార్యం, కారణం లేక పోయి ఉండవచ్చు.
అనంతావైః ప్రశ్నాః