విడి విడి
11/15/01ఏరోజుకారోజు మనసు, మనిషి విడివిడి గా కన్పడుతున్నాడు. కొన్ని గంటల లేదా రోజుల తేడాలో మైండ్ క్లియర్ గా ఎనర్జీ లెవల్ ఎక్కువగా ఉండడమూ, మనసంతా ద్వేషంతో నిండి అసంతృప్తితో జ్వలించడమూ, వేరే వేరే మనుషులకి జరుగుతున్నట్లుగా ఉంది. ఈ స్థితులన్నింటినీ కలిపి ఉంచే దారాన్ని చూస్తే అది అక్కడ లేదని తెలుస్తుందిట .. అదే అసలు జ్ఞానం ట (శాస్త్రాలు కట్టిన కాన్సెప్ట్ల భవనం కాదుట ఇది..)
ముడి
Nov 12, 01.ప్రపంచం తో మనసు వేసుకున్న ముడులు విప్పబడాలంటే రాయక తప్పదు. మరి ఇది ఎలా పడిన
ముడి అంటే - గొప్పదనం (?) చూపించాలన్న కోరికతో పడిన ముడి. ఎన్ని జన్మలలో (లేదా నిన్నలలో) పోగుచేసిందో!
సంచితం
11/11/01లోకం కోసం కల్పించుకున్న నేను ముక్కలయేటప్పటికి అసలు రిలీజ్ కావాల్సి వచ్చింది ఇప్పుడు నిజం నేను కి . ఇది దొరకనంత కాలం అశాంతి తప్పదు. ఆ తర్వాత కూడా ఏదో అసంతృప్తి ఉంటుంది కానీ అది వేరే కధ.
ఎన్ని జన్మల సంచితాలో - ఎంత మంది తాత ముత్తాతల కోట్ల పూర్వీకుల శక్తులోతన మె దడు లో
ప్రక్షిప్తమైనవి.. శాస్త్ర విషయవాంఛలలో మునిగి, తేలి, ఆక్రమించుకొని అర్ధం చేసుకోవాలన్న కోరిక.
తద్వారా కలిగే సంతృప్తి.
తెలియని శక్తి ఆవహించినట్లుగా ఒక రకమైన క్లారిటీ, రాస్తున్న సమయంలో. కొంచెంసేపట్లోనే లోపలినించి అరుపులు - ఇదే ఇదే నీ అసలు సెల్ఫ్- కంటిన్యూ, స్టిక్ ఆన్ - మళ్ళీ యంత్రపు గరగర మొదలు.
బాధా సప్తశతి
11/11/01ఏదో విషయంలో వచ్చిన అశాంతి, అసంతృప్తి
పరిసరాల్లోని ప్రక్క వాళ్ళమీదకి ప్రవహించి
అట్నించి అమిత వేగంతో పరావర్తించి
మిరుమిట్లు గొలిపే పెద్ద శబ్దం తో
కాలాన్ని భళ్ళు మనిపించింది.
మాటలు రాక మ్రాన్పడి పోతే
అటూ ఇటూ దుమికి, నన్ను ఖండ ఖండాలుగా
నరికి, తిట్ల రూపం లో పారుతోంది.